telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

మష్రూమ్‌ టీ తాగితే ఈ సమస్యలు మటాష్ !

పుట్టగొడుగులు రుచిగా ఉండేటమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిల్లో పీచు పదార్థాలు, ప్రోటీన్లు విటమిన్లు ఉంటాయి. అయితే.. వీటితో తయారు చేసిన టీ తాగితే లభించే ప్రయోజనాలు అనేకం అని అంటున్నారు నిపుణులు.
కావలసిన పదార్థాలు : ఒక అంగుళం ఉండే ఛాగా మష్రూమ్‌ క్యూబ్‌ లేదా ఛాగా టీ బ్యాగ్‌, రెండు కప్పుల వేడీ నీళ్లు. ఈ పదార్థాలతో మష్రూమ్‌ టీ తయారు చేసుకోవచ్చు.
ఉపయోగాలు :
మష్రూమ్‌లో ప్రొటీన్లు ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ టీ తాగితే బరువు తగ్గుతారు.
ఈ టీ మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది
గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటి జబ్బుల్లో ఉపయోగించే మందుల్లో కూడా వీటిని వాడతారు
ఈ టీ జీర్ణక్రియ బాగా జరిగేలా సహకరిస్తుంది.
మష్రూమ్స్‌లో పొటాషియం ఎక్కువగా, సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది. అందువల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది.
వీటిల్లో విటమిన్‌-డి ఉంటుంది. కావున దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు స్ట్రాంగ్‌ గా తయారవుతాయి.
వీటిల్లో ఉండే పోషకాలు పీచు పదార్థాలు, విటమిన్ల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పుంజుకుంటుంది. అందుకే వీటితో చేసిన ఆహార పదార్ధాలు మాత్రమే కాకుండా మష్రూమ్‌ టీ తాగితే శరీరానికి ఎంతో మంచిది.

Related posts