telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

సూపర్ స్టార్ కృష్ణను ఓదార్చిన సీఎం కేసీఆర్

krishna kcr

ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) బుధవారం అర్ధరాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ విజయనిర్మల మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఈ సాయంత్రం కృష్ణ నివాసంలో విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను చూడగానే కృష్ణ కంటతడిపెట్టారు. కేసీఆర్ ను పట్టుకుని చిన్నపిల్లాడిలా బోరున విలపించారు. కృష్ణ అంతటి వ్యక్తిని ఆ స్థితిలో చూడాల్సి రావడం పట్ల కేసీఆర్ కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. బోరున విలపిస్తున్న కృష్ణను దగ్గరకు తీసుకుని ఓదార్చారు.

Related posts