telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తాను, తన తండ్రి కరోనాను ఎలా ఎదుర్కొన్నారో వివరించిన విశాల్

Vishal

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విఆలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలామంది సెలెబ్రిటీలు సైతం ఈ వైరస్ బారిన పడ్డారు. అందులో కొంతమంది చికిత్స తీసుకుంటుండగా… మరికొంతమంది కోలుకున్నారు కూడా. ఈ క్రమంలో హీరో విశాల్, తన తండ్రి కరోనా బారిన పడిన విషయమే. తాజాగా విశాల్ కరోనాను ఎలా జయించాలో వివరించారు. ఈ సంద‌ర్భంగా విశాల్ ఒక వీడియో విడుద‌ల చేశారు. “నేను ఏ విద‌మైన ఆయుర్వేదిక్‌, హోమియోప‌తి మెడిసిన్‌ను ప్ర‌మోట్ చేయ‌డంలేదు. కేవ‌లం ఈ మెడిసిన్ ద్వారా నేను, మానాన్న గారు, మా మేనేజ‌ర్ కోవిడ్‌-19 నుండి ఎలా కోలుకున్నామో మీ అంద‌రికీ చెప్పాల‌న్న‌దే నా కోరిక అని అన్నారు. విశాల్‌. విశాల్ మాట్లాడుతూ – “నాన్న గారికి జూన్‌లో క‌రోనా పాజిటీవ్ వ‌చ్చింద‌ని ఈ మ‌ధ్య కాలంలో ఒక వీడియో పెట్టాను. మా నాన్న గారికి 82 సంవ‌త్స‌రాలు. ఈ వ‌య‌సుతో ఆయ‌న‌ను హాస్ప‌ట‌ల్లో అడ్మిట్ ‌చేయాల‌నే ఆలోచ‌న అస్స‌లు లేదు. ఇంట్లోనే ఉంచి ఆయ‌న‌ను బాగా చూసుకోవాల‌నేదే నా కోరిక. అందుకే నేనే దగ్గ‌రుండి ఆయ‌న‌ను చూసుకున్నాను. ఆ క్ర‌మంలో అవే ల‌క్ష‌ణాలు నాకు క‌నిపించాయి. దాంతో టెస్ట్ చేయించుకుంటే నాకు క‌రోనా పాజిటీవ్ అని తేలింది. నాతో పాటు నాకు ద‌గ్గ‌ర‌గా ఉండే మా మేనేజ‌ర్ కి కూడా పాజిటీవ్ వ‌చ్చింది. మా అంకుల్‌ డాక్ట‌ర్ హరిశంకర్ గారి స‌‌మ‌క్షంలో మేము ఆయుర్వేదిక్‌, హోమియోప‌తి మెడిసిన్ తీసుకున్నాం” అని వివరించాడు విశాల్.

Related posts