కమల్ హాసన్ నటించిన చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించారు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచిన మూవీ టీమ్ తెలుగు ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఇందులో మొదటిసారిగా కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించారు. వీరేకాకుండా స్టార్ హీరో సూర్య కూడా ‘విక్రమ్’లో అతిథి పాత్రలో అలరించనున్నాడు.
ఈ ట్రైలర్‌లో కమల్, విజయ్, ఫాహద్ ఫాజిల్ ఎవరికీ వారి ప్రత్యేక నటనతో అదరగొట్టారు. వీరి ముగ్గురి లుక్స్, యాక్టింగ్ కన్నుల పండుగగా ఉంది. అందరిని సమానంగా చూపిస్తూ ట్రైలర్ కట్ చేశారు. ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా యాక్షన్‌తో నిండిపోయింది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. మే 15న ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.