telugu navyamedia
సినిమా వార్తలు

తీవ్ర విషాదంలోఎన్టీఆర్ కుటుంబం.. ఎన్టీఆర్ కుమార్తె ఉమా మ‌హేశ్వ‌రి హ‌ఠాన్మ‌ణం

నంద‌మూరి కుటుంబంలో తీవ్ర విషాదం. దివంగ‌త న‌టుడు, టీడీపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు చిన్న కూతురు ఉమా మహేశ్వరి హ‌ఠాన్మ‌ణం చెందారు. జూబ్లీ హీల్స్‌లోని త‌న నివాసంలో సోమవారం మృతి చెందారు.

 ఎన్టీఆర్‌కు మొత్తం 12 మంది సంతానం. అందులో 8 మంది కొడుకులు, 4 కూతుర్లు .. ఒకరు చంద్రబాబు నాయుడు భార్య అయినా భువనేశ్వరి, దగ్గుపాటి పురందేశ్వ‌రి, మరొక కూతురు లోకేశ్వరి కాగా చిన్న కూతురు ఉమా మహేశ్వరీ.

ఆమె హఠాన్మరణంతో ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి చేరుకుంటున్నారు.

ఈ విష‌యం తెలుసుకున్న పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఉమామహేశ్వరి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నారు.

Related posts