telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను మరొకరి కాపురాలు కూల్చే టైప్ కాదు… హీరోయిన్ వ్యాఖ్యలు

Ananya-Pandey

అనన్య పాండే కథానాయికగా నటించిన సినిమా ‘పతి పత్ని ఔర్ వో’. ముదస్సర్ అజీజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించారు. 1978లో ఇదే టైటిల్‌తో వచ్చిన సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. డిసెంబర్ 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో నటి భూమి పెడ్నేకర్ కార్తిక్ భార్య పాత్రను పోషించారు. ఇందులో అనన్య.. కార్తిక్ రెండో ప్రేయసిగా కన్పించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తనకు ఎలాంటి వ్యక్తి బాయ్‌ఫ్రెండ్‌గా భర్తగా రావాలని అనుకుంటున్నారో వెల్లడించారు. “నేను ప్రేమ విషయంలో చాలా నిజాయతీగా ఉంటాను. నా సంతోషం కోసం మరొకరి కాపురాలు కూల్చే టైప్ కాదు నేను. నేను చాలా రొమాంటిక్. నాకు ప్రేమలో పడటం అంటే ఇష్టం. నాకు చాలా రిలేషన్‌షిప్స్ ఉండేవి. అందులో తప్పు లేదు. స్కూల్లో చదువుకునేటప్పుడు చిన్న చిన్న లవ్ స్టోరీస్ అందరికీ ఉంటాయి. అయితే ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ పెళ్లైనప్పటికీ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. అలాంటి వ్యక్తిని నాకు బాయ్‌ఫ్రెండ్‌గా భర్తగా అస్సలు వద్దు. నేను చాలా నిజాయతీగా ఉంటాను. కాబట్టి నా బాయ్‌‌ఫ్రెండ్ నుంచి కూడా అదే నిజాయతీని కోరుకుంటాను” అని తెలిపారు.

Related posts