telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సాహో” నిర్మాతలపై కేసు… ఏం జరిగిందంటే ?

Saaho

ప్రభాస్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా నటించిన భారీ ఆక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. సుజిత్‌ దర్శకుడు. వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మాతలు. ఈ సినిమా నిర్మాతలపై గురువారం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. ఎస్సై వీరప్రసాద్ తెలిపిన కథనం ప్రకారం… బెంగుళూరుకు చెందిన జౌట్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటేడ్ కంపెనీకి చెందిన ‘ఆర్క్‌టిక్ ఫాక్స్’ పేరుతో ఉన్న బ్యాగును సినిమా మధ్యలో చూపిస్తామని సాహో నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకొని.. మోసం చేసినట్లు కంపెనీ మార్కెటింగ్ హెడ్ విజయ్‌ రావు (33) ఫిర్యాదు చేశాడు. సాహో నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డిలు సెలబ్రిటీ సర్వీసెస్ ప్రై. లిమిటెడ్ (ఎజెన్సీ) సీఈఓ హిమాంక్ దువ్వూరు తో కలిసి ఒప్పందం కుదుర్చుకొని .. రూ. 37 లక్షలు, ఏజెంట్‌గా వ్యవహరించిన కంపెనీకి 1.49 లక్షలు ఒప్పందం ప్రకారం అందజేయడం జరిగింది. దీంతో తమ బ్రాండ్ పేరును సినిమాలో చూపిస్తారనే ఉద్ధేశంతో ఔట్ షైన్ ఇండియా కంపెనీ నుండి హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో బ్రాడ్‌కాస్టింగ్ చేసుకోవడానికి రూ. కోటి పెట్టుబడి కూడా పెట్టింది. ఒప్పందం ప్రకారం సినిమాలో తమ బ్రాండ్‌ను చూపించకపోవడంతో రూ. 1,38,49,000లను సంస్థ నష్టపోయింది. దీంతో సాహో నిర్మాతలపై సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.

Related posts