telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

పెద్దవారు.. కష్టాలు.. వారానికి 120 గంటలు ..

early morning schedule of famous ones

సాధారణంగా చాలా మందిలో ఉండే ఉత్సాహం ఏమంటే, జీవితంలో విజయం సాధించిన వారి జీవన శైలి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని. అందుకే అలాంటి వారి గురించి ఎటువంటి వార్తలు తెలిసినా వెంటనే దానికి స్పందిస్తుంటారు. అందుకే ఇటీవల సామజిక మాధ్యమాలలో కూడా ప్రముఖులు అభిమానులకు అందుబాటులోకి వచ్చేశారు. అయినా కొందరి ప్రముఖుల గురించి తెలుసుకోవాలని ఉంటుంది. మీ అభిమానం ఎవరి మీద ఉందో మరి.. కొందరి ప్రముఖుల దినచర్యల గురించి .. మీకు నచ్చుతుంది.. ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది ఈ వార్తలు..

ఎలన్‌ మస్క్‌: ఉదయం ఏడు గంటలకు నిద్రలేస్తారు. వెంటనే ఒక అర్ధగంట పాటు మెయిల్స్‌ చెక్‌ చేసుకొని వాటికి సమధానాలు పంపిస్తారు. అదే సమయంలో కాఫీ తాగేస్తారు. అయిదుగురు పిల్లల్ని స్కూల్‌కు పంపించాక స్నానం ముగించుకొని ఆఫీస్‌కు బయల్దేరతారు. మస్క్‌ పూర్తిగా శ్రమజీవి.. ఆయన వారంలో 120 గంటలు కష్టపడతారని పేరుంది.

జాక్‌ డోర్సె: ట్విటర్‌ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సె తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేస్తారు. ఒక అర్ధగంట ప్రాణాయామం ఆయన ఉదయపు దినచర్యలో భాగం. ఆ తర్వాత 20 నిమిషాలు వ్యాయామం చేస్తారు. అనంతరం కాఫీ తాగీ రోజువారీ పనులను మొదలు పెడతారు.

వారెన్‌ బఫెట్‌: అపర కుబేరుడు వారెన్‌ బఫెట్‌ బాగా నిద్రపోవడానికి ఇష్టపడతారు. నిత్యం కచ్చితంగా 8గంటలు నిద్ర ఉండేలా చూసుకొంటారు. ఉదయం 6.45కు కచ్చితంగా నిద్రలేస్తారు. అనంతరం వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, యూఎస్‌ఏ టుడే వంటి పత్రికలను చదువుతారు.

జెఫ్‌ బెజోస్‌: బఫెట్‌ లాగే బెజోస్‌ కూడా నిద్రకు బాగా విలువ ఇస్తారు. నిద్ర తన జీవితంలో అత్యంత కీలకమైన భాగమని బెజోస్‌ చెబుతారు. అలారం సాయం లేకుండా బెజోస్‌ నిద్ర లేస్తారు. అత్యంత కీలకమైన భేటీలను ఆయన లంచ్‌కు ముందే ముగించేస్తారు. ఆయన ఉదయం 10 గంటలకే భోజనం చేయడం పూర్తవుతుంది.

బిల్‌ గేట్స్‌: ఉదయం నిద్రలేచిన వెంటనే ట్రెడ్‌మిల్‌పై పరుగుతో గేట్స్‌ దినచర్య మొదలవుతుంది. అదే సమయంలో ఆయన విద్యకు సంబంధించిన డీవీడీలను చూస్తారు. దాదాపు గంట సేపు ఆయన ఈ వ్యాయామాలు చేస్తారని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. తాను కోకా పఫ్ సెరెల్స్‌ తింటానని గేట్స్‌ చెబుతారు. కానీ ఆయన భార్య మిలిండా మాత్రం గేట్స్‌ అల్పహారం తీసుకోరని అంటారు.

జుకర్‌బర్గ్‌: ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌ బర్గ్‌ నిద్ర లేచిన వెంటనే బెడ్‌పైనే ఉండి ఫోన్‌ను చెక్‌ చేసుకొంటారు. అనంతరం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో విశేషాలను చూస్తారు. దుస్తుల ఎంపిక వంటి చిన్న విషయాల కోసం ఆలోచనను వృథా చేసుకోనని మార్క్‌ చెబుతారు. అందుకే ఆయన ఎప్పుడు సర్వసాధారణమైన జీన్స్‌, టీషర్ట్‌ల్లో కన్పిస్తారు.

Related posts