telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

జాతీయ దివ్యంగుల సాధికారత కేంద్రం ప్రారంభం

రంగారెడ్డి CRPF హెడ్ క్వార్టర్స్ లో జాతీయ దివ్యాంగుల సాధికారత కేంద్రాన్ని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, CRPF అధికారులు పాల్గొన్నారు. యుద్ధరంగంలో దివ్యాంగులుగా మారిన జవాన్లకు ‘నేషనల్ సెంటర్ ఫర్ డివ్యంగ్ ఎంపవర్మెంట్” అండగా నిలువనుంది. CRPF దివ్యంగ్ జవాన్లను ఫిజికల్, మెంటల్ గా ఫిట్ గా తయారు చేయడమే ఈ సెంటర్ ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఆర్పీఎఎఫ్ దళాలు దేశానికి అత్యంత ముఖ్య సేవలు అందిస్తున్నాయని.. కొన్ని దుర్భర పరిస్థితుల్లో దేశ రక్షణలో కొన్ని ప్రమాదాలు జరుతుంటాయన్నారు. అలాంటి సమయంలో కూడా దివ్యాంగులుగా మారిన వారు ఎలాంటి నిరాశకు లోనవకుండా ఇలాంటి సాధికారిక కేంద్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దివ్యాంగులు అయినా వారు కూడా దేశంలో సైబర్ నేరాల పై పోరాడుతున్నారని… ప్రధాని మోడీ చొరవతో పారా క్రీడలకు మంచి ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని… వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఐటి సెక్టార్ లో సీఆర్పీఎఫ్ దివ్యాంగులకు ఉద్యోగాలు అందేలా చూస్తామని చెప్పారు.

Related posts