telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్‌ వరాల జల్లులపై విజయశాంతి కామెంట్‌…

సీఎం కేసీఆర్‌ కురిపిస్తున్న వరాల జల్లుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని వరాలు కురిపించినా ప్రజలు కేసీఆర్‌ను నమ్మబోరని విజయశాంతి ఎద్దేవా చేశారు. “సీఎం కేసీఆర్ గారు కురిపిస్తున్న వరాల జల్లు చూస్తుంటే రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఉద్యోగాల భర్తీ, ఫిబ్రవరిలో పీఆర్సీ, ప్రమోషన్లు, బదిలీలు, సాగు చట్టాలకు సై అనడం, ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గడం… ఇలా గత నాలుగైదు రోజులుగా కేసీఆర్ గారు చేస్తున్న ప్రకటనల మర్మమేంటో ఎవరికీ తెలియదనుకుంటే పొరపాటు. గడచిన టీఆరెస్ ఆరేళ్ళ పాలనా కాలంలో జనం గుండెలు బాదుకున్నా పట్టించుకోని సమస్యలపై ఇప్పుడు ఒకొక్కటిగా దృష్టి సారిస్తుండటం వెనుక కుట్ర కాక ప్రజా సంక్షేమం ఉందని ప్రజలు నమ్మే పరిస్థితుల్లేవు. అయితే, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు ప్రభుత్వ అధినేత అహంకారాన్ని కొంత దారికి తెచ్చినట్లు అనిపిస్తుంది. ఇలాంటి పరిణామాలే వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, రాబోయే ఉపఎన్నికల్లోనూ వస్తే… ఈ సీఎం గారు ఎంతో కొంత జన సంక్షేమం గురించి కనీసం ఆలోచించి, తద్వారా మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ, సమయం, అపాయింట్‌‌మెంట్లు ఇచ్చి ప్రజా సమస్యలపై కొంత దృష్టి పెట్టే ప్రయత్నం జరగవచ్చు. అందుకోసమైనా తదుపరి ఎన్నికల ముందువరకూ కొంతకాలం అధికారంలో ఉండే ఈ టీఆరెస్ ప్రభుత్వానికి, ప్రతి సందర్భంలోను ఓటమి రుచి చూపించవలసిన బాధ్యత ఉందని తెలంగాణ సమాజం అభిప్రాయపడుతోంది.” అంటూ విజయశాంతి ఫైర్‌ అయ్యారు.

Related posts