telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ లో బీజేపీ , టీఆర్ ఎస్ ఫ్లెక్సీల యుద్ధం..’చాలు మోదీ.. చంపకు మోదీ.. బై బై మోదీ’

తెలంగాణ లో బీజేపీ , టీఆర్ ఎస్ ఫ్లెక్సీల యుద్ధం తారాస్థాయికి చేరింది. సాలుదొర‌..సెల‌వు దొర అంటూ బీజేపీ మొద‌లుపెట్టిన పొలిటిక‌ల్ ఫైట్‌కు..టీఆర్ ఎస్ త‌న‌దైన స్ట‌యిల్‌లో కౌంట‌ర్ ఇచ్చింది.

జులై 2 ,3 తేదీల్లో హైదరాబాద్‌లోబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ కార్య‌క్ర‌మానికి ప్రధాన మంత్రి మోదీ భాగ్యనగరానికి రానున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మోదీ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేసింది.

సుమారు ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నోవాటెల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. మోదీ పర్యటన ఉన్నంతసేపు మూడంచెల భద్రత కొనసాగనుంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌, హెచ్‌ఐసీసీ, రాజ్‌భవన్‌ చుట్టూ కేంద్ర బలగాలు మోహరించాయి.  డ్రోన్‌ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

మ‌రోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో టివోలీ థియేటర్ ఎదురుగా మోదీకి వ్యతిరేకంగా హోర్డింగులు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. తెలంగాణకు చేసిందేమీ లేదంటూ.. ‘సాలు మోదీ.. సంపకు మోదీ.. బై..బై.. మోదీ’ అంటూ బ్యానర్లు కనిపించాయి. మోదీ బహిరంగ సభ జరగనున్న పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఈ హోర్డింగ్‌లు, బ్యానర్లు కలకలం సృష్టించాయి.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హోర్డింగ్ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ప్లెక్సీలను తొల‌గించేందుకు పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఆ హోర్డింగ్‌లు ఎవరు పెట్టారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా భద్రతాలోపం ఉండకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు.

ప్లెక్సీల‌ను తొల‌గించేందుకు పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు బేగంపేట పోలీసులు జీహెచ్ ఎంసీ అధికారులకు స‌మాచారం ఇవ్వ‌డంతో..జీహెచ్ ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. క్రేన్ తెప్పించి ఆ ఫ్లెక్సీల‌ను తొల‌గిస్తున్నారు. అటు మోడీకి వ్య‌తిరేకంగా టీఆర్ ఎస్ శ్రేణులు హైద‌రాబాద్‌లో ప్లెక్సీలు ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల బీజేపీ నాయ‌కులు మండిప‌డ్డుతున్నారు.

Related posts