శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రామాదంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ఉద్యోగులు భూగర్భంలోనే చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించి ప్రమాదానికి గల కారణాలను అన్వేషించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.