telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ : తెలంగాణ సర్కార్ పై హై కోర్టు సీరియస్

నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై టీఎస్ హైకోర్టు కేసీఆర్‌ ప్రభుత్వంపై సీరియస్‌ అయింది. నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు బ్యాన్ చేయలేదన్న హైకోర్టు…. మీడియా లో వచ్చిన కథనాలను చూసి సుమోటోగా విచారించింది. ఒక వైపు డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ కొత్త వైరస్ మోర్ డేంజర్ అంటుంటే వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారన్న హైకోర్టు.. న్యూ ఇయర్ వేడుకలకు పబ్ లు బార్ లు విచ్చలవిడిగా ఓపెన్ చేసి ఏం చేయలనుకుంటున్నారంటూ సీరియస్‌ అయింది. రాజస్థాన్, మహారాష్ట్ర లో వేడుకలు ఇప్పటికే బ్యాన్ చేశారన్న హైకోర్టు… ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఫైర్‌ అయింది. కరోనా దృష్టిలో ఉంచుకుని వేడుకలు జరపోద్దని ప్రజలకు సూచించామని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం… ప్రభుత్వం ఈరోజు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది హైకోర్టు. భౌతిక దూరం, మాస్క్ లు తప్పకుండా వినియోగించాలన్న హైకోర్టు.. వేడుకలకు సంబంధించిన పూర్తి నివేదికను జనవరి7 న సమర్పించాలని ఆదేశించింది.

Related posts