telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

న్యూ ఇయర్‌ : హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇవే

కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌లో ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. ఈ ఆంక్షలపై ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… రేపు ఉదయం 5 గంటల వరకు హైదరాబాద్‌లో ఆంక్షలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ట్యాంక్‌ బండ్‌, ఎన్టీఆర్ మార్గ్‌, నెక్టెస్‌ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయని… ఈరోజు రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం వరకు వాహనాల రాకపోకలను నిషేధమని తెలిపారు. నెక్లెస్‌ రోడ్డు, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్‌ మార్క్‌, బీఆర్‌కే భవన్‌, తెలుగుతల్లి కూడలి, లిబర్టీ జంక్షన్‌, నల్లగుట్ట రైల్వే వద్ద వాహనాలను దారి మళ్ళిస్తామని.. బేగంపేట ఫ్లైఓవర్ మినహా నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లైఓవర్లు ఈరోజు రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు మూసివేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో యాభై డ్రంకెన్ డ్రైవ్ టీమ్ లను ఏర్పాటు చేశామని… సుమారు 350 మంది సిబ్బందితో డ్రంకెన్ డ్రైవ్ చేస్తామని తెలిపారు. మందుబాబులు మాత్రం తాగి వాహనాలను నడపవద్దని..డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.

Related posts