యాంకర్ శ్రీముఖిపై తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఓ ఇంగ్లీష్ పేపర్‌పై ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. ట్విట్టర్‌లో నకిలీ అకౌంట్ల ద్వారా పెట్టే పోస్టుల ఆధారంగా పత్రికలో వార్తలు రాస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీముఖిని టార్గెట్ చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెపై తప్పుడు వార్తలు ప్రచురించిన పత్రికపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా శ్రీముఖి ప్రస్తుతం బిగ్‌బాస్ -3 కంటెస్టెంట్. పలు టీవీ కార్యక్రమాలకు ఆమె యాంకర్‌గా పని చేశారు. అంతేకాకుండా సినిమాల్లోనూ ఆమె నటించారు.
ముందే చెప్పా.. “సైరా” ఎవరు చూస్తారు అని… గిరిబాబు కామెంట్స్