telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా విజృంభణ : స్విగ్గీ శుభవార్త

swiggy providing more jobs

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా  మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను కరోనా బారీన పడకుండా కాపాడుకునేందుకు ముందుకు వస్తున్నాయి. వారి ఉద్యోగులకు ఉచితంగానే కరోనా వ్యాక్సిన్‌ వేయిస్తున్నాయి. దీంతో చాలా మంది ఉద్యోగులకు కరోనా నుంచి ఉపసమనం కలుగుతోంది. అయితే తాజాగా.. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా తన ఉద్యోగులు, డెలివరీ పార్ట్‌నర్లకు ఉచితంగా వ్యాక్సినేషన్‌ అందించనుంది. ఈ మేరకు స్విగ్గీ సీఈఓ వివేక్‌ సుందర్‌ తాజాగా ఓ ప్రకటన రిలీజ్‌ చేశారు. తమ ఉద్యోగుల కరోనా టీకా ఖర్చులను తామే భరిస్తామని పేర్కొన్నారు. అలాగే ఆ టీకా వేయించుకునే రోజున వేతనంతో కూడిన సెలవుగా పరిగణిస్తామని తెలిపారు. స్విగ్గీ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు రెండు లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది.  

Related posts