telugu navyamedia
క్రీడలు వార్తలు

పంత్ తొందరగా ఔట్ అవుతాడు…

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 578 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. అయితే ఈ రోజు తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆర్చర్ మొదట్లోనే రోహిత్(6) ఔట్ చేసి షాక్ ఇచ్చాడు. అయితే కష్టాలో ఉన్న భారత జట్టును పంత్, పుజారా ఆదుకున్న విషయం తెలిసిందే. నిలకడగా రాణించి 5వ వికెట్ కు 119 పరుగుల భాగసౌమ్యం నెలకొల్పారు. కానీ  73 పరుగుల వ్యక్తిగత  స్కోర్ వద్ద పుజారా క్యాచ్ రూపంలో పెవిలియన్ కు చేరుకోగా కాసేపటికే 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ ఔట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం పుజారా మాట్లాడుతూ… పంత్ తెలివిగా ఆడాలి ఉంటుందని, కొన్ని సార్లు తొందరగా ఔట్ అవుతాడని చెప్పిన పూజారా అతను నెమ్మదిగా నేర్చుకుంటాడని నమ్మకం వ్యక్తం చేశాడు. పంత్ ఏ షాట్ ఆడాలి, ఏది వదిలేయాలి అనేది  నేర్చుకోవాలని సూచించాడు. అతను కొంచెం ఓపికగా ఉండి, అక్కడ ఉన్న వారితో భాగస్వామ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే… అతను ఎక్కువ సేపు బ్యాటింగ్ చేస్తే మంచి పరుగులు సాధించగలడు. కాబట్టి అతను నేర్చుకుంటాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, అతను ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, అతను తన తప్పుల నుండి నేర్చుకుంటాడు “అని పుజారా అన్నారు.

Related posts