telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలుసా…?

Bigg-Boss-4

కరోనా సమయంలో ప్రారంభమైన బిగ్ బాస్ 4 ఎట్టకేలకు తుది అంకానికి చేరింది. మొదట్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా చివరికి వచ్చేసరికి షోలో కంటెస్టెంట్ల గొడవలు, ఆటలు, లవ్ ట్రాక్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ షో తన నాలుగో సీజన్‌ను జరుగుతోంది. ఈ రోజు చివరి రోజు రేపు ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది అనౌన్స్ చేయనున్నారు. దాంతో ప్రతి సీజన్‌లాగానే ఈ సీజన్‌కు చీఫ్ గెస్ట్‌గా ఎవరు వస్తారన్నది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. లాస్ట్‌ ఫైనల్‌ డిసైడ్‌ సెగ్మెంట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి గెస్ట్‌గా వస్తాడని టాక్‌. ఇది ఇలా ఉండగా… ప్రస్తుతం హౌజ్‌లో ఐదురుగు సభ్యులున్నారు. వీరందరూ ఫైనలిస్ట్స్‌. అభిజీత్‌, అఖిల్‌, సోహైల్‌, అరియనా, హారికలు ఈ సీజన్‌ ఫైనల్స్‌కు చేరుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ అని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఉన్న ఐదుగురిలో అభిజిత్ అందరి కంటే ఎక్కువ ఓట్లు సాధించాడని తెలుస్తోంది. అభిజిత్ తర్వాత సొహైల్ రెండో స్థానంలో నిలిచాడు అని అంటున్నారు. ఇక అఖిల్ మూడో స్థానంలో నిలవగా అరియానా నాలుగో స్థానంలో హారిక ఐదో స్థానంలో నిలిచిందని చెబుతున్నారు. అయితే ఎవరు ఈ సీజన్ టైటిల్ గెలుచుకున్నారు అనేది మాత్రం రేపు సాయంత్రం అధికారికంగా చీఫ్ గెస్ట్ గా హాజరైన స్టార్ హీరో ప్రకటించనున్నారు. చూడాలి మరి ఆ హీరో ఎవరు అనేది.

Related posts