telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తుంది…

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో మూసేసిన థియేటర్లు మళ్ళీ ఈ మధ్యే తెరుచుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు కేవలం 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రానే పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. కానీ ఈ మధ్య 100 శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇవ్వడంతో మూవీ లవర్స్, ఆడియన్స్ తో మల్టీప్లెక్స్, థియేటర్ల వద్ద సందడిగా కనిపించింది. కరోనా నిబంధనలు పాటిస్తూనే థియేటర్ల మేనేజర్లు పలు జాగ్రత్తలతో షోలను నడిపిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో సినిమాలు అందుబాటులోకి వస్తున్నప్పటికి బిగ్ స్క్రీన్ మీద చూడ్డానికే ఇష్టపడుతున్నారు సినీ ప్రేక్షకులు. పెద్ద స్టార్లకు చెందిన కొత్త సినిమాలు వస్తే థియేటర్లు మరింత సందడిగా మారనున్నాయని థియేటర్ల ఓనర్లు చెప్పుకొస్తున్నారు. దాదాపుగా సంవత్సరం పైగా మూతపడ్డ థియేటర్లలో ప్రస్తుతం సందడి వాతావరణం చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ మార్గదర్శకాలకి అనుగుణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుంచి మల్టీప్లెక్స్ ల వరకు అన్ని చోట్ల సేఫ్టీ ప్రికాషన్స్ మస్ట్ గా ఫాలో అవుతున్నారు. థియేటర్ పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఇందుకోసం ఎక్స్ ట్రా స్టాఫ్ ను  నియమించామని మేనేజర్లు చెప్తున్నారు. అయితే థియేటర్లకు ప్రజలు బాగానే వస్తుండటంతో చాలా సినిమాలు తమ విడుదల తేదీలను ప్రకటించాయి.

Related posts