telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

స్పీకర్ తమ్మినేని పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకుడు…

మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో నామినేషన్ లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ్మినేని సీతారాం స్వగ్రామమైన తొగరాం, పక్క గ్రామమైన కలివరంలో టీడీపీ మద్దతు దారులు నామినేషన్ లు వేసేందుకు సిద్ధమయ్యారు. రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తుండటంతో తమ్మినేని సీతారాం టీడీపీ మద్దతుదారులను పోటీ చేయొద్దని బెదిరిస్తున్నాని కూనరవి ఆరోపించారు. తొగరాంలో తన సతీమణి వాణిని సర్పంచ్ అభ్యర్ధిగా నిలబెట్టి ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తున్నారని టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న తమ్మినేని భారతిని నామినేషన్ వేయకుండా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని ఏకగ్రీవాల కోసం ఒత్తిడి తెస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ కు, ఎన్నికల కమీషన్ కు తెలియ జేసినట్లు కూన రవి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు తమ్మినేని భారతి నామినేష్ దాఖలు చేస్తారని ఆమె నామినేషన్ వేయకుండా ఎవరూ అడ్డుకోకుండా తగిన భద్రత కల్పించాలని ఎస్పీని కూన రవి కోరారు. చూడాలి మరి దీని పై స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది.

Related posts