telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మొదటిరోజు ముగిసిన .. కస్టడీ.. కీలక ఆధారాలు లభ్యం..

disa accused first day custody with clues

దిశ హత్య కేసులో నిందితులు మహ్మద్, బొల్లు శివ, నవీన్, చింతకుంట చెన్నకేశవులు తొలిరోజు కస్టడీ ముగిసింది. నిందితులను చర్లపల్లి జైలులోనే విచారించారు. వారిని బయటకు తీసుకొచ్చి విచారించే పరిస్థితి లేనందున.. జైలులోనే ఘటనకు సంబంధించి వివరాలు రాబడుతున్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కూడా అర్ధరాత్రి చేపట్టారు. డే సమయంలో నిర్వహిస్తే స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదరవుతుందని ఈ మేరకు జాగ్రత్తలు తీసుకున్నారు. తొలిరోజు కస్టడీలో భాగంగా నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరించారు. నిందితులు లారీలో కూడా తనిఖీలు చేప్టారు. దిశ బ్లడ్ శాంపిల్స్‌ను క్లూస్ టీం సేకరించంది. తల వెంట్రుకలను కూడా స్వాధీనం చేసుకున్నారు. లారీ క్యాబిన్‌లో కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. దిశ ఫోన్ తుండుపల్లి టోల్‌గేట్ సమీపంలో పాతిపెట్టినట్టు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు.

మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రిలిమినరీ చార్జ్‌షీట్ వేసేందుకు సిట్ సిద్ధమవుతుంది. దిశ కేసు విచారణను ఏడు బృదాలు చేపడుతాయి. ఒక్కో బృందంలో ఏడుగురు పోలీసులు ఉంటారు. కమిషనర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ఇన్వెస్టిగేషన్ చార్జ్‌షీట్ దాఖలు చేసేవరకు టీం పనిచేస్తాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వరంగల్‌లో చిన్నారిపై కీచకుడు ప్రవీణ్ లైంగికదాడిపై నిరసనలు పెల్లుబికిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసింది. వాదనల తర్వాత 60 రోజుల్లోనే కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దిశ విషయంలో కూడా 45 రోజులకు మించకుండా నిందితులకు ఉరి శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అందులోభాగంగానే ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. అయితే ఇలాంటి ఎన్నో కేసులలో ఉరి వేసిన చాలా మందికి ఇంకా ఆ శిక్ష అమలు చేయకపోవడంతో, ఈ నిందితులకు కూడా ఉరి శిక్ష ఖరారు చేసినప్పటికీ, ఎన్నేళ్లకు అది అమలు చేస్తారో అని నిపుణులు విమర్శిస్తున్నారు. ఆందోళనలు జరుగుతున్నాయని త్వరితగతిన శిక్ష వేసి, అది అమలు చేయకుండా నేరస్తులను జైళ్లలో పెట్టి ఏళ్లకు ఏళ్ళు మేపడం పై పలు సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నవో కేసులో కూడా ప్రముఖులు ఉండటం చేతనే కేసు నీరుగారించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేరం చేసిన వారిని అందరిని సమంగా చూడాలని, అలాగే శిక్షలు అమలు చేయాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు.

Related posts