telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

సీఎం జగన్ ఇంట విషాదం..మామ గంగిరెడ్డి మృతి

Cm Jagan Uncle ganagireddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట విషాదం నెలకొంది. జగన్ మామ, ఆయన భార్య వైఎస్ భారతి తండ్రి ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. అనారోగ్యం బారినపడిన గంగిరెడ్డి గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పరిస్థితి విషమించడంతో గత అర్ధరాత్రి కన్నుమూశారు. పేదల వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న గంగిరెడ్డి 2001-2005 మధ్య పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు.  గంగిరెడ్డి మృతదేహాన్ని పులివెందులకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Related posts