telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గుజరాత్ మాజీ సీఎం మాధవసిన్హా సోలంకి కన్నుమూత

గుజరాత్‌ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్‌ నేత మాధవ్‌సింగ్‌ సోలంకి మృతి చెందారు. గాంధీనగర్‌లోని తన నివాసంలో ఆయన శనివారం కన్నుముశారు. ఆయన కేంద్ర విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. మాధవ్‌సింగ్‌ సోలంకి 1980 లో గుజరాత్‌లో కేహెచ్‌ఏఎం నినాదంతో అధికారంలోకి వచ్చారు. 1980 ఎన్నికలకు ముందుకు కేహెచ్ఏఎం కూటమిని ఏర్పాటు చేశారు. వృత్తిరీత్యా న్యాయవాదైన సోలంకి… 1976లో కొంతకాలం సీఎంగా పనిచేశారు. మళ్లీ 1981లో సీఎంగా ఎన్నికయ్యారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 1985లో రాజీనామా చేసినప్పటికీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకు గాను 149 గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. మాజీ సీఎం మృతికి ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలు పాటు గుజరాత్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాధవ్‌సింగ్‌ సోలంకి గొప్ప నాయకుడని కొనియాడారు. సమాజానికి ఆయన చేసిన సేవలను పొగిడారు మోడీ.

Related posts