telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యా… స్టార్ హీరో కూతురు కామెంట్స్

Ira-Khan

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమిర్‌ ఖాన్‌ కూతురు ఇరా ఖాన్‌ తాను కూడా చిన్న వయసులో లైంగిక వేధింపులకు గురయ్యానంటూ తెలపడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇరా తన మానసిక ఒత్తడిపై తాజాగా ఓ వీడియో సందేశాన్ని పంచుకుంది. ఇటీవల ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవం సందర్బంగా తను నాలుగేళ్లకు పైగా డిప్రెషన్‌కు గురైనట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి ఆమె ఒత్తిడికి గల కారణాలు చెప్పాలంటూ నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యలో ఇరా సోమవారం నెటిజన్‌ల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పంచుకున్నారు. పది నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఇరా తన మానసిక ఒత్తిడికి గల కారణాలపై మాట్లాడింది. అదే విధంగా తను లైంగిక వేధింపులు కూడా ఎదుర్కొన్నట్లు ఈ సందర్భంగా ఇరా తెలిపింది. ‘నాకు 14 ఏళ్ల వయసులో ఉండగా లైంగిక వేధింపులకు గురయ్యాను. అప్పుడు ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడో నాకు తెలియదు. అయితే ఏం జరుగుతుందో ఆ వ్యక్తికి తెలిస్తే అది విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే ఆ పరిస్థితి నాకు ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యేది. ఈ క్రమంలో ఏడాది తర్వాత నాకు అర్థమైంది. వెంటనే నా తల్లిదండ్రులకు ఈ మెయిల్‌ ద్వారా విషయం చెప్పి దాని నుంచి బయటపడ్డాను. ఇక అది కూడా నాపై పెద్ద ప్రభావం చూపలేదు. దాని నుంచి నేను ముందుకు సాగాను, జీవితంలో కూడా నాకు చెడుగా అనిపించలేదు’ అని ఆమె వివరించింది.

Related posts