యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో”. ఇప్పటికే విడుదలైన టీజర్లో ప్రభాస్ చేస్తున్న స్టంట్స్ , యాక్షన్ సీన్స్ సామాన్య జనాలనే కాక సెలబ్రిటీలని కూడా ఆకట్టుకుంటున్నాయి. 150 కోట్ల బడ్జెట్‌తో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర చివరి షెడ్యూల్ జరుగుతుండగా, ఆగస్ట్ 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదల కాగా… సినీ ప్రముఖులందరూ టీజర్ పై ప్రశంసలు వర్షం కురిపించారు. ఈ చిత్ర టాకీ పార్ట్ దాదాపు పూర్తికాగా… ప్రస్తుతం ఆస్ట్రియాలో పాటల చిత్రీకరణ జరుగుతుంది. అక్కడ ప్రభాస్, శ్రద్ధాలపై సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. ఇప్పటినుండే సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో సినిమా నుండి తొలి పాట “సైకో సయాన్” సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ పాటను “సైకో సయాన్”ను బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్జితో చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.
previous post
అందుకే చెయ్యి కోసుకున్నా… బిగ్ బాస్ కంటెస్టెంట్ వ్యాఖ్యలు