telugu navyamedia
సినిమా వార్తలు

స్టార్ హీరోపై సింగర్ కామెంట్స్… ఫలితంగా బెదిరింపులు

Salman-KHan

ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనా మహాపాత్రకు సల్మాన్ అభిమాని నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు ఎదురయ్యాయి. ఇటీవల సల్మాన్ హీరోయిన్ ప్రియాంకపై చేసిన కామెంట్లను సోనా వ్యతిరేకించడంతోనే ఆమెకు బెదిరింపులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. “ప్రియాంక… నిక్‌ను వివాహం చేసుకునేందుకు ఆమె కెరియర్‌లో ఒక మంచి సినిమాను వదిలివేసింది” అని సల్మాన్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సోనా “ప్రియాంకకు తన జీవితంలో చేసుకునేందుకు చాలా పనులున్నాయి. ఆమె ప్రయాణం ఇతర యువతులకు ప్రేరణగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నచ్చని సల్మాన్ అభిమాని… సింగర్ సోనాను హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఈ మెయిల్ ద్వారా ఆమెను సల్మాన్ ఫ్యాన్ హెచ్చరించారని సోనా తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. అమ్మార్ రషిద్ అనే వ్యక్తి సోనాను హెచ్చరిస్తూ “నువ్వు మరోమారు సల్మాన్ విషయంలో ఏమి మాట్లాడినా, మేము మీ ఇంట్లోకి చొరబడి నిన్ను చంపేస్తాం. ఇది చివరిసారిగా చెబుతున్నా” అని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన సోనా తన ట్విట్టర్ అకౌంట్‌లో “భారత్” సినిమా హీరో అభిమాని ఒకరు నన్ను బెదిరిస్తూ వస్తున్నాడు. ఇటువంటి బెదింపులు తరచుగా వస్తున్నాయి” అని పేర్కొంది.

Related posts