telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

టీజీటీ పోస్టులకు బీటెక్‌ వారూ అర్హులే: హైకోర్టు

Telangana Inter results petition High court

తెలంగాణలో టీజీటీ (టీచర్‌ ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌) పోస్టులకు బీటెక్‌ పూర్తి చేసిన అభ్యర్థులను కూడా అర్హులుగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌లో ఉన్న బీఏ, బీకాం, బీఎస్సీ వారితోపాటు బీటెక్‌ పూర్తి చేసిన అభ్యర్థులను కూడా అర్హులుగా పరిగణించాలని హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

నోటిఫికేషన్‌లోని డిగ్రీలతోపాటు బీటెక్‌ చేసిన వారిని కూడా అర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఖమ్మంకు చెందిన సంజీవరావు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ బీటెక్‌తోపాటు బీఎడ్‌ కూడా చేశారని, పరీక్ష రాసి ఉత్తీర్ణులైనా ఎంపిక చేయలేదని ఆయన తరఫు న్యాయవాది ఉమాదేవి వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్‌సీటీఈ 2014 రూల్స్‌ మేరకు టీజీటీ పోస్టులకు నోటిఫికేషన్‌లోని డిగ్రీలతోపాటు బీటెక్‌ పూర్తి చేసిన వారిని కూడా అర్హులుగా ప్రకటించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts