telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ : .. రెండో రాజధానిపై .. కేంద్రం స్పష్టత…

Least voting city is hyderabad

హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేసే అవకాశం ఉందని వస్తున్న ఊహాగానాలకు కేంద్రం తెరదించింది.ఈ రోజు రాజ్యసభ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో దేశానికి రెండో రాజధాని అవసరమని ప్రభుత్వం భావిస్తుందా? అని పరోక్షంగా హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిని చేసే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. దీనికి హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశానికి రెండో రాజధాని ప్రతిపాదన ఏదీ లేదని ఆయన తేల్చిచెప్పారు.

ఇటీవల మాజీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగరరావు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తే బాగుంటుందనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని అంశం కేంద్రం ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇలాంటి ఆలోచన ఏమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా రాజ్యసభలో ఇదే విషయాన్ని నిత్యానంద రాయ్ లిఖిత పూర్వకంగా తేల్చి చెప్పడంతో ఈ ప్రచారానికి తెరపడినట్లైంది.

Related posts