కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు తొలిసారిగా పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తమ కుమార్తె బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని చూసేందుకు వీలుగా ఆమె తల్లిదండ్రులు నారాయణ్ సీతారామన్, సావిత్రి సీతారామన్ లు పార్లమెంటుకు చేరుకున్నారు. పార్లమెంట్‌కు వచ్చిన నిర్మలాసీతారామన్ తల్లిదండ్రులను సిబ్బంది, అధికారులు సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు. అటు నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంట్‌కు చేరుకున్నారు.
ఆర్థికశాఖ కార్యాలయం నుంచి తన బృందంతో బయల్దేరిన నిర్మలా సీతారామన్..మధ్యలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి బడ్జెట్ కాపీని అందజేశారు. అక్కడి నుంచి పార్లమెంట్‌కు చేరుకున్నారు. బడ్జెట్‌కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటలకు నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. భారత్ ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా మలుస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రకటనకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉండొచ్చని తెలుస్తోంది.