telugu navyamedia
తెలంగాణ వార్తలు

11 రాష్ట్రాల నుంచి వ‌ల‌స‌లు : సీఎం కేసీఆర్

ఈ దేశానికి కావాల్సింది రావాల్సింది రాజ‌కీయ ఫ్రంట్‌లు కాదు. ఇవేం సాధించ‌లేవు. ఇవాళ దేశానికి కావాల్సింది ప్ర‌త్యామ్నాయ ఎజెండా. ఒక అద్భుత‌మై ప్ర‌గ‌తి ప‌థంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్ర‌తిపాదిక ప‌డాలని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదికగా సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. 2000లో తాను తెలంగాణ అని మాట్లాడితే. ఏం ప‌ని లేదా అని కొంద‌రు అన్నారు.

సంక‌ల్పంతో జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రులకు, ఆ భ‌గ‌వంతుడికి దండం పెట్టి బ‌య‌లుదేరి తెలంగాణ సాధించాం. అంతేకాదు. సాధించిన తెలంగాణ‌ను దేశానికి రోల్‌మోడ‌ల్‌గా నిలిచేలా చేశామ‌న్నారు. పాల‌మూరు జిల్లాలో వ‌ల‌స‌లు పోయేవారు. ఇవాళ వ‌ల‌స‌లు రివ‌ర్స్ వ‌చ్చాయి.

11 రాష్ట్రాల నుంచి మ‌న వ‌ద్ద‌కు వ‌ల‌స‌లు వ‌స్తున్నారు. బీహార్ హ‌మాలీ కార్మికులు లేక‌పోతే తెలంగాణ రైస్‌మిల్లులు న‌డ‌వ‌వు. హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్ లో భ‌వ‌న నిర్మాణ రంగంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బీహార్ కార్మికులు ప‌ని చేస్తున్నారు. తెలంగాణ‌లో ప‌ని పుష్క‌లంగా దొరుకుతోంది. శాంతి భ‌ద్ర‌త‌లు ప‌టిష్టంగా ఉన్నాయని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Related posts