telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీడీపీ…!

TDP-flag

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూయడంతో.. ఆయన ప్రతినిధ్యం వహించిన నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో లక్షా 91,666 మంది  ఓటర్లున్నారు. డిసెంబర్ 1న అనారోగ్యంతో నర్సింహయ్య మృతి చెందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి జానారెడ్డి బరిలో నిలిచారు. టీఆర్ఎస్, బీజేపీ.. ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే, అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తెరపైకి వచ్చింది.. హాలియలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇంచార్జి మువ్వ అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల్లో  పోటీలో ఉంటుందని ప్రకటించారు.. పార్టీ తరుపున తనను బరిలో నిలవాలని రాష్ట్ర పార్టీ ఆదేశించిందన్న ఆయన.. నాగార్జునసాగర్ అభివృద్ధి చెందింది అంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్నారు.. ఇక, తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ప్రకటించారు మువ్వ అరుణ్‌ కుమార్.చూడాలి మరి ఏపీలో ప్రభావం చూపించలేకపోవుతున్న టీడీపీ తెలంగాణలో ఏ మాత్రం తన ప్రభావం చూపిస్తూఉంది అనేది.

Related posts