తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీఆర్ఎస్ అధినేత, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశంసలు కురిపించారు.కేసీఆర్ లేకుంటే తాము ఎవ్వరం లేమని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదని బాల్క సుమన్ తెలిపారు. ఆయన లేకుంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
కేసీఆర్ లేకుంటే బంగారు తెలంగాణ సాధ్యం కాదని చెప్పారు. . ఈ మేరకు ట్వీట్ చేసిన బాల్కసుమన్.. టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సీఎంవో, హరీశ్ రావు, సంతోష్ కుమార్ తదితరులను ట్యాగ్ చేశారు.