telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలి: మంత్రి కేటీఆర్

ktr trs

సువిశాల నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. ఈ నేపథ్యంలో నల్లమలలో యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో నల్లమలలో యురేనియం తవ్వకాలపై నిషేదం విధిస్తూ తీర్మానం చేశారు.

తీర్మానాన్ని శాసన సభలో మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ యురేనియం తవ్వకాలను తెలంగాణ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. నల్లమల కేవలం అడవే కాదని, తెలంగాణ ప్రజల ఆస్తి అని తెలిపారు. అడవి నుంచి పూచిక పుల్లను కూడా ముట్టనియ్యమని స్పష్టం చేశారు. కేంద్రం బలవంతం చేస్తే పోరాటానికి యావత్ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యేలు హెచ్చరించారు.

Related posts