గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఓటర్లు మాస్కులు ధరించి.. కరోనా రూల్స్ పాటిస్తూ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. మొదటి రెండు గంటల్లో కేవలం 4.2 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయింది. ఎప్పటి లాగే ఇప్పుడు కూడా ఓటింగ్ గ్రేటర్ వాసులు ఆసక్తి చూపటం లేదు. అయితే.. కూకట్‌పల్లిలో ఉద్రిక్తతం నెలకొంది. కూకట్‌పల్లిలోని ఫోరం మాల్ దగ్గర బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తీవ్రమైన ఘర్షణ నెలకొంది. బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్, బీజేపీ గొడవతో కూకట్‌పల్లిలో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. డబ్బులు పంచుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కారును బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య తోపులాట చోటుచేసుకుంది. అయితే… ఈ గొడవ జరిగిన సమయంలో కారులో మంత్రి పువ్వాడ అజయ్ లేనట్టుగా సమాచారం అందుతోంది. ఈ ఘర్షణ వాతావరణాన్ని… చక్కదిద్దే పనిలో పోలీసులు ఉన్నారు.
previous post
next post