telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పాత పద్ధతి లో రీజిస్ట్రేషన్ చేసుకోవాలన్న హైకోర్టు…

high court on new building in telangana

ధరణి పోర్టల్ పై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. అయితే తాము రిజిస్ట్రేషన్ లపై స్టే ఇవ్వలేదని మరోసారి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదుపై హైకోర్టు సుదీర్ఘ విచారణ జరిగింది. పాత పద్దతిలో రీజిస్ట్రేషన్ చేస్తే మాకేం అభ్యంతరం లేదని హైకోర్ట్ స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ గతంలో కార్డ్ పద్దతిలో జరిగాయి. అదే పద్దతి కొనసాగించాలని పిటీషన్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ గతంలో లాగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చూడాలన్నారు అడ్వొకేట్  జనరల్. రూల్స్ 221-230 ఏపీ & తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్, sec 70 B, ప్రకారం తెలంగాణ రాష్ట్రము మొత్తం నోటిఫై చేయాలన్నది హైకోర్ట్. విత్ అవుట్ ధరణి, గతంలో చేసినట్లుగానే ఉండాలన్న పిటీషనర్ తరపు న్యాయవాది.. రిజిస్ట్రేషన్ కు ప్రాపర్టీ టాక్స్ గుర్తింపు కార్డ్ తప్పనిసరిగా ఉండాలని, ఇది పాత పద్ధతి మాత్రమే అని అన్నారు ఏజీ. ఆధార్ కార్డు, ధరణిలో ఎంట్రీ వివరాలు అడగవద్దన్నారు పిటీషనర్ తరపు న్యాయవాది. హైకోర్టు ఏలాంటి స్టే ఇవ్వకుండా, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ఆపిందని హైకోర్ట్ తెలిపిన పిటీషనర్. ప్రభుత్వాన్ని ధరణి వివరాలు మాత్రమే ఆపాలని చెప్పింది కానీ రీజిస్ట్రేషన్ లపై ఎలాంటి స్టే ఇవ్వలేదని హైకోర్టు తేల్చిచెప్పేసింది.  నాన్ అగ్రికల్చర్ ఆస్తులను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయొచ్చన్న హైకోర్టు. స్లాట్ బుకింగ్ తో పాటు PTIN ఆధారంగా ఉన్న పద్దతిలోనే రిజిస్ట్రేషన్  చేయాలన్నది హైకోర్టు. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీర్స్ కు PTIN లేనివాళ్లకు  రెండు రోజుల్లో ఇవ్వాలన్న హైకోర్టు. తర్వాత డాకుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయాలన్న  హైకోర్టు. కోర్ట్  ఉత్తర్వులు ఖాతారు చేయడం లేదన్న పిటీషనర్స్. అమ్మేవారు కొనేవారు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లి పాత పద్ధతి లో రీజిస్ట్రేషన్ చేసుకోవాలన్న హైకోర్టు. ధరణిపై మాత్రం ప్రభుత్వం కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు అదేశం. ఇక తదుపరి విచారణను ఈనెల 16కు  వాయిదా వేసింది.

Related posts