telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనాను జయించిన అభిషేక్ బచ్చన్

Abhishek

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరంతా ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చేరారు. ఇప్పటికే ఐశ్వర్యరాయ్, ఆరాధ్యకు నెగిటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక అమితాబ్ బచ్చన్ కూడా గత ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజాగా అభిషేక్ బచ్చన్ కూడా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాజాగా అయనకి చేసిన పరీక్షల్లో నెగిటివ్ అనే రిపోర్ట్ వచ్చిందిని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నట్లుగా వెల్లడించారు. దాదాపుగా 29 రోజుల పాటు అభిషేక్ బచ్చన్ చికిత్స పొందారు. ఇన్ని రోజులు తాను కోలుకోవాలని ప్రార్ధించిన ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలిపారు అభిషేక్. “మా ఫ్యామిలీ కరోనాను జయించేందుకు డాక్టర్లు చాలా హెల్ప్‌ చేశారు. వాళ్లు లేకుంటే మేం అంతా కోలుకునే వాళ్లం కాదు” అని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు.

Related posts