telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : మరో లీక్… రాజమౌళి సీరియస్

RRR

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైంద‌ని ఇటీవ‌ల మేక‌ర్స్ తెలిపారు. అయితే చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా అలియా భ‌ట్‌, ఎన్టీఆర్‌కి జోడీగా ఓలివియా మోరిస్‌పై స‌నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చితాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. భారీ బ‌డ్జెట్‌తో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. చిత్రానికి సంబంధించి ఇప్ప‌టి వ‌రకు ఒక్క లుక్ కూడా విడుద‌ల కాక‌పోవ‌డంతో సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా గ‌మనిస్తున్నారు. అయితే చిత్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి షూటింగ్‌కి సంబంధించిన ఎలాంటి విజువ‌ల్స్ బ‌య‌ట‌కి రాకుండా ప‌లు జాగ్ర‌త్తలు తీసుకుంటున్న‌ప్ప‌టికి లీకులు మాత్రం ఆగ‌డం లేదు. అప్ప‌ట్లో రామోజీ ఫిల్మ్ సిటీలో పోలీస్ స్టేష‌న్ సెట్ వేసి తీసిన సన్నివేశాలు నెట్‌లో లీక్ కాగా, ఆ త‌ర్వాత ప్ర‌జలందరికి ఏదో చెబుతున్నట్టుగా ఉన్న తార‌క్ లుక్ ఒక‌టి లీక్ అయింది. ఇక తాజాగా ఎన్టీఆర్ మీద చిత్రీకరిస్తున్న ఫైట్ సీన్ తాలూకు విజువల్ ఒకటి బయటికొచ్చింది. అడవి పులికి, కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు మధ్యన జ‌రిగే ఈ పోరాట సన్నివేశం సినిమాలోని కీలకమైన అంశాల్లో ఒక‌టి కాగా, దీనిని ఎవ‌రు లీక్ చేసి ఉంటార‌నే దానిపై చిత్ర బృందం ఆరా తీస్తుంది.

Related posts