telugu navyamedia
సినిమా వార్తలు

‘అఖండ’ మూవీ నుంచి అప్డేట్..

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించ‌గా.. శ్రీకాంత్, జ‌గ‌ప‌తి బాబు మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

అఖండ నుంచి అప్డేట్ వచ్చేసింది. దీపావళి కానుకగా ‘అఖండ’ సాంగ్ టీజర్​ను రిలీజ్ చేయనున్నారు. పూర్తి వీడియోను నవంబరు 8న విడుదల చేస్తారు. ఇందులో బాలయ్య.. డిఫరెంట్ గెటప్స్​లో డ్యూయ‌ల్ రోల్ లో కనిపించనున్నారు. ఒక పాత్రలో అఘోరాగా కనిపించ‌నున్నారు.

balakrishna akhanda movie new update

బాలయ్య-బోయపాటి కాంబినేషన్​లో తెరకెక్కుతున్నవ‌స్తున్న మూడో సినిమా ఇది. ఇంతకు ముందు ‘సింహా’, ‘లెజెండ్​’ చిత్రాలతో బ్లాక్​బస్టర్​లు కొట్టిన వీరిద్దరూ.. ఇప్పుడు హ్యాట్రిక్ తో తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. తమన్సంగీతమందించారు.

Related posts