telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేసిన సోనూసూద్

Sonusood

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సినీ,రాజకీయ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. దీంతో మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది. తాజాగా టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటారు. అనంతరం సోనూసూద్ మాట్లాడుతూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచన చాలా గొప్పదని, చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఇందులో తానూ కూడా పాల్గోనందుకు ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా సోనూసూద్ కోరారు. ఇక కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు. అంతటితో ఆగకుండా కష్టం అనే మాట విన్పిస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు.

Related posts