telugu navyamedia
సినిమా వార్తలు

ఆ వార్తలపై స్పందించను… అనారోగ్య వార్తలపై రానా

Rana

“బాహుబలి”తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్న రానా దగ్గుబాటి ప్రస్తుతం తెలుగులో “విరాటపర్వం” సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో వైపున తమిళ, హిందీ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రానా ఇప్పుడు తెలుగులో “విరాటపర్వం”, హిందీలో “హాథీ మేరే సాథీ” సినిమాల్లో నటిస్తున్నారు. యాడ్స్ లోను నటిస్తున్నాడు. అయితే “బాహుబలి” సినిమాలో కండలు తిరిగిన శరీరంతో కనిపించిన రానా ఈ మధ్య కాలంలో బాగా సన్నబడిపోయాడు. దాంతో రానా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనే ప్రచారం జరిగింది. అయితే తాజా ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ అలాంటిదేం లేదని తేల్చేశాడు. “హాథీ మేరే సాథీ” సినిమా కోసమే సన్నబడ్డట్టుగా చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం అత‌నికి యూఎస్‌లో మూత్ర‌పిండి మార్పిడికి సంబంధించిన ఆప‌రేష‌న్ జ‌రుగుతుంద‌ని, తన కొడుకుకి తల్లి అవయ‌వ దానం చేసిందని కూడా వార్తలు వచ్చాయి. ఈ పుకార్ల‌పై రానా స్పందించారు. యూఎస్‌లో ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తన అనారోగ్యం గురించి వ‌స్తున్న వార్త‌లు వినివిని విసిగిపోయానని, ఇకపై వాటిని పట్టించుకోనని చెప్పాడు రానా. తన గురించి మీడియా ఏమి రాస్తుందో కూడా తాను చదవడం లేదని అన్నారు. మ‌రి ఇప్ప‌టికైన రానా ఆరోగ్యంకి సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌కి బ్రేక్ అనేది ప‌డుతుందా అనేది చూడాలి.

Related posts