telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏబీసీడీ చిత్రం.. రివ్యూ..

ABCD

నేడు అల్లుశిరీష్ నటించిన ఏబీసీడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకూ సరైన హిట్ లేని అల్లు శిరీశ్ కొత్త సినిమా ఏబీసీడీ విజయాలపై అనేక ఆశలు పెట్టుకున్నాడు. అనేక ఫ్లాపుల తర్వాత ఆమధ్య శ్రీరస్తు శుభమస్తు సినిమా ఒక్కటే అల్లు శిరీశ్ ది కాస్త ఫరావలేదనిపించింది. మళ్లీ ఇన్నాళ్లకు వచ్చిన ఎబిసిడి టీజర్, ట్రైలర్స్ అల్లు శిరీశ్ హిట్ కొట్టేస్తాడని అంచనాలు పెంచాయి. ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో చాలామంది సినిమా చూస్తూ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. వారి ప్రకారం.. ఫస్ట్ హాఫ్ బావుందట. సెకండ్ హాఫ్ పరవాలేదనిపించే విధంగా ఉందట.

సినిమాలో బాల నటుడిగా రాణించిన భరత్‌ పాత్ర హైలైట్ గా నిలిచిందట. కామెడీ వరకూ బాగానే ఉందట. కానీ స్క్రీన్ ప్లే స్లోగా ఉండటం ఓ మైనస్ పాయింట్ గా చెబుతున్నారు. ఇంకొందరేమో ఎబిసిడి ఒరిజినల్ వర్షన్ స్థాయిలో లేదంటున్నారు. ఇంకొందరు ఇది తీవ్రంగా నిరాశపరిచే చిత్రం అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు అసలు కథలోకే వెళ్లలేదట. ఈ ఎబిసిడి చిత్రం రాజీవ్ రెడ్డి దర్శకత్వంలో, మధుర శ్రీధర్ నిర్మాణంలో తెరకెక్కింది. రుక్సార్ థిల్లోన్ హీరోయిన్.

Related posts