telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నాలోని ఆశలకి రూపం నీవు…

నాలోని ఆశలకి రూపం నీవు
నా అంతరంగపు రారాజు నీవై నను చేరావు
నా వూహలకి వూపిరి పోసావు
తనువు మనసు పులకించేలా నను కవ్వించావు
ఆప్యాయతతో అలరించావు
అణువణువు వెచ్చని నీ శ్వాసలో చలికాసుకుంది
తీయటి మీ స్పర్షతో మురిసిపోయింది
మీ సరాగాల సరిగమలతో సరసాలాడింది నా మనసు
మీ మృదు మధుర స్పర్షతో సేద తీరింది
నా వూహల వూయలలో విహరిస్తుంది తనువు మనసు..

……………………………………………..

మీరు మీరుగా లేరని తెలిసి
వలచిన మనసు వాపోయింది
కాలంతో కష్టాలతో పొరాడటం
అలవాటైన హృదయం దాన్ని
జీర్ణించుకో సాగింది
ఏది ఏమైనా ఒంటరితనం శాశ్వతమని
బాదలు భారాన్ని తీర్చవనీ
కష్టాలు కాన్నీళ్ళు తుడవలేవనీ
అర్ధం చేసుకుంది
నిచ్చింతగా జీవనం కొనసాగిస్తుంది..
ఓ అబల

Related posts