telugu navyamedia
సినిమా వార్తలు

“గద్దలకొండ గణేష్”కు కాసుల వర్షం

Valmiki

వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన “గద్దలకొండ గణేష్” సినిమాకి మొదటి రోజే మంచి టాక్ రావడంతో సూపర్ ఓపెనింగ్స్ సాధించింది. మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా గ్యాంగ్ స్టర్ అవతారంలో వరుణ్ తేజ్.. అద్భుత నటనను ప్రదర్శించాడు. ముందుగా ఈ సినిమా పేరు వాల్మీకి అనుకున్నా.. అనివార్య కారణాలతో సినిమా విడుదలకు 6 గంటల ముందు గద్దలకొండ గణేష్‌గా పేరు మార్చాల్సి వచ్చింది. సినిమా విడుదలైన రోజు నుంచి వరుసగా మూడు రోజుల పాటు వసూళ్లు నిలకడగా కొనసాగుతున్నాయి. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం విజయం వైపుగా దూసుకుపోతుంది. శుక్ర, శని, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.13.4 కోట్ల షేర్ సాధించింది. యూఎస్‌లో కూడా ఈ చిత్ర వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నట్లు వస్తున్నట్లు సమాచారం. సోమవారం నుండి వచ్చే వసూళ్లను బట్టి ఈ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చెప్పవచ్చు. ఐతే వచ్చే వారం పెద్ద సినిమాల విడుదల లేకపోవడం ఈ సినిమా వసూళ్లకు అనుకూలించే అంశం. అక్టోబరు 2న సైరా విడుదల అయ్యేవరకు గద్దలకొండ గణేష్ చిత్ర వసూళ్ల జోరు కొనసాగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Related posts