telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బోయపాటి డైరెక్షన్‌లో సూర్య ?

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిచింది. సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఈ తమిళ స్టార్ హీరో సూర్యకు అటు తమిళ పరిశ్రమతో పాటుగా ఇటు తెలుగులోనూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే త్వరలో సూర్య ఓ స్ట్రయిట్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. మాస్‌ చిత్రాల డైరెక్టర్‌ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తారట. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు వీరిద్దరినీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నారట. నేరుగా ఓ తెలుగు సినిమా చేయాలని సూర్య ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. బోయపాటి చెప్పిన హై వోల్టేజ్‌ యాక్షన్‌ స్టోరీ సూర్యకు నచ్చిందట. దీంతో ఆ సినిమాలో నటించేందుకు సూర్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్‌.

Related posts