telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

1978 పలాస : “బావొచ్చాడు…” వీడియో సాంగ్

Palasa

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’. తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మార్చి 6న రిలీజ్ చేయనున్నారు. విడుదలకు ముందే ఇండస్ట్రీ‌లో హాట్ టాపిక్‌గా మారిందీ మూవీ. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ మెంబెర్స్ ప్రశంసలు పొందింది. ‘నాది నక్కిలీసు గొలుసు’ పాట వైరల్ అయింది. తాజాగా ‘బావొచ్చాడు’ అనే వీడియో సాంగ్ విడుదల చేశారు. ఉత్తరాంధ్ర జానపదం ఆధారంగా రూపొందించిన ఈ పాటను అదితి భవరాజు పాడారు.

Related posts