telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగార్జునకు వెల్లువెత్తుతున్న బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు

Nag

నిత్య నూతన యవ్వనుడు, మన్మధుడు, సోగ్గాడు, కింగ్ నాగార్జున నేడు (ఆగ‌స్ట్ 29) 60వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నాగ్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్పెయిన్ వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. అక్క‌డే త‌న బర్త్‌డే వేడుక‌లు జ‌రుపుకోనున్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు భారీ ఎత్తున బ‌ర్త్‌డే వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు. ఇప్పటి వరకు 91 సినిమాల్లో నటించిన నాగార్జున ‘హలో బ్రదర్’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘అన్నమయ్య’, ‘నువ్వు వస్తావని’, ‘ఆజాద్’, ‘సంతోషం’, ‘మన్మథుడు’, ‘శివమణి’, ‘నేనున్నాను’, ‘మాస్’, ‘శ్రీరామదాసు’, ‘కింగ్’, ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఊపిరి’, ‘దేవదాస్’.. ఇలా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించారు. నాగ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ట్విట్టర్‌లో #HBDKINGNAGARJUNA హ్యాష్‌ట్యాగ్ ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఇటీవ‌ల మ‌న్మ‌థుడు 2 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నాగ్ త్వ‌ర‌లో బంగార్రాజు చిత్రం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. బిగ్ బాస్ సీజ‌న్‌3 హోస్ట్‌గా కూడా నాగ్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. ఇక ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఆయనకి ట్విట్ట‌ర్ వేదిక‌గా బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Related posts