telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ పుట్టినరోజు… అభిమానులకు చరణ్ గిఫ్ట్

Pawan

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెప్టెంబరు 2న తన 48వ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటి నుంచే హడావుడి మొదలెట్టేశారు పవన్ అభిమానులు. పవన్ బర్త్‌డే‌కు సరిగ్గా ఐదు రోజుల ముందు మెగా అభిమానులకు రాంచరణ్ ఓ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ బర్త్‌డే వేడుకల్లో భాగంగా మెగా ఫ్యాన్స్ కోసం కామన్ డీపీని విడుదల చేశారు. కామన్ డీపీలో ఒకవైపు ‘సేవ్ ఏపీ ఫ్లడ్ విక్టిమ్స్’ అనే సందేశాన్ని ఉంచారు. రెండో వైపున వినాయకుడి ఆకారంలో ‘సెప్టెంబర్’ 2ని పొందుపరిచారు. పవన్ కళ్యాణ్ కామన్ డీపీని రాంచరణ్ రిలీజ్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్‌గా మారింది. మెగా అభిమానులంతా ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్‌లో పవన్ ఫొటోను డీపీగా పెడుతున్నారు. #PawanKalyanBirthdayCDP హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. సెప్టెంబరు 2న వినాయక చవితి కూడా ఉండడంతో రెండు పండగలను ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు మెగా ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు.

Related posts