telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

గాడిద పాలు తాగితే ఆ సమస్యలు దరికి రావు !

గాడిదపాలకు పల్లెలో, పట్టణాలలో ఆదరణ ఇంకా తగ్గలేదు. ఈ గాడిద పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ఈ విషయం మన చిన్న తనం నుంచి వింటున్నాం. అయితే.. ఆవు పాలు గొప్పనో.. లేక గాడిద పాలు గొప్పవో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు పాల కన్నా గాడిద పాలలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుందట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గాడిద పాలు ఇంచు మించు తల్లిపాల అంత శ్రేష్టమైనవట. అంతేకాదు గాడిత పాలతో ఔషధాలే కాకుండా బ్యూటీ ఉత్పత్తులను కూడా రూపొందిస్తున్నారు. గాడిద పాలు ఆరోగ్యానికి చాలా మంచిదని.. వీటిని తాగడం వల్ల ఆస్తమా, దగ్గు, జలుబు, కిడ్నీలో రాళ్లు, జాండిస్‌ లాంటి సమస్యలు పోతాయట. కీళ్ల నొప్పులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గాడిద పాలు యాంఈ బ్యాక్టీరియా గుణాలతో పాటు రోగ నిరోధక శక్తిని కలిస్తుందట. అంతేకాదు ఆవుపాలతో పోల్చుకుంటే గాడిద పాలలో 60 శాతం విటమిన్‌ సి ఎక్కువగా లభిస్తుంది. అలాగే ఆవుపాల కంటే ఎక్కువగా న్యూట్రియట్స్‌ ఇందులో ఉంటాయి. ప్రోటీన్లు, పాస్పోలిఫిడ్స్‌ మరియు సెరమైడ్స్‌ గాడిద పాలలో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యానికి ఎంతో మంచింది. అంతేకాదు.. మెటాబాలిజం వేగవంతం అవడానికి ఎంతోగానే గాడిద పాలు ఉపయోగపడతాయి. మార్కెట్లో దొరికే ఎన్నో స్కిన్‌ క్రీమ్స్‌ కన్నా ఎన్నో రేట్లు మంచివి గాడిదపాలు.

Related posts