telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే !

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో నేడు ఒకే విడతలో ఎన్నికలు జరుగనుండగా… పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్‌ జరుగనుంది. చివరి గంటలో ఓటు వేసేందుకు “కరోనా” పేషెంట్లకు అనుమతి ఇవ్వనున్నారు అధికారులు. పశ్చిమ బెంగాల్‌లో మూడో దశలో 31 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగనుండగా… 31 స్థానాల్లో 205 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 78.5 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.74 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా… రంగంలో మొత్తం 957 మంది అభ్యర్థులు ఉన్నారు. అస్సాంలో 40 స్థానాలకు తుది విడత ఎన్నికలు జరుగుతుండగా… మొత్తం 337 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 79.19 లక్షల మంది ఓటర్లు… ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88,936 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే–కాంగ్రెస్‌ కూటమి, అన్నాడీఎంకే– బీజేపీ, మక్కల్‌ నీదిమయ్యం–ఐజేకే, ఎస్‌ఎంకే, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం–డీఎండీకే, ఎస్‌డీపీఐ పార్టీలు కూటమిగా ఎన్నికలలో పోటీ చేస్తుండగా… “నామ్‌ తమిళర్‌ కట్చి” ఒంటరిగా పోటీ చేస్తోంది. రంగంలో 3,998 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉండగా… తమిళ నాడు లో రాష్ట్రవ్యాప్తంగా 1.58 లక్షల మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బందితో భద్రత కల్పించారు అధికారులు.

Related posts