telugu navyamedia
సినిమా వార్తలు

ఓ సుందరీ. .  ! 

bhuvi devi poetry corner

ఓ సుందరీ . . . ! 
నా ముద్దుల మనోహరీ ! ! 
ఎందుకుచేస్తావు  కిరికిరి ! 
నా ఆనంద లహరీ ! ! 
ఈ వసంత వేళలో . . ! 
వలపుల  ఉద్యానవనంలో . . ! ! 
చిలకా గోరింకల్లా స్వేచ్ఛగా విహరించుదాం! 
అరవిరిసిన పువ్వులు ! 
స్వాగతం పలుకుతున్నాయి ! 
పిల్ల గాలులు కవ్విస్తున్నాయి !
చెట్టు కొమ్మలు పరదాలయ్యాయి ! 
పచ్చిక బయలు పాన్పులయ్యాయి ! 
రా ! ప్రియా. . ! రా . . ! 
ఓ అపూర్వ సుందరీ ! 
నా ముద్దుల మనోహరీ ! 
జాగేలా? !  సిగ్గేలా ? !  
బిడియమేల ? ! బింకమేలా ? ! 
హంసల పల్లకిలో పయనించుదాం!  
నీలాల నింగిలో విహరించుదాం! 
రంగుల హరివిల్లు పై బొమ్మరిల్లు కట్టుకొని
కలకాలం కాపురముందాం ! 
మన ప్రేమ జీవితాన్ని పంచుకుందాం ! 
రా. . !  సుందరీ  రా. . !  వేగిరమే . . రా ! 
నా ముద్దుల మనోహరీ . . !
నా ప్రియ మైన ఆనంద లహరీ ! 

– పల్లోలి శేఖర్ బాబు, కొలిమిగుండ్ల

Related posts